Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

జై భారత్ వాయిసు దామెర
పేద రెడ్ల సంక్షేమం, అభివృద్ధి కోసం సత్వరమే రాష్ట్రంలో రెడ్డి కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని రెడ్డి సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం హనుమకొండ జిల్లా దామెర మండల కేంద్రంలోని ఏఎన్ఆర్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ లో  రెడ్డి సంఘం దామెర మండల అత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు అర్జుల కిషన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమ్మేళనంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో గోపు జైపాల్రెడ్డి మాట్లాడుతూ సమాజంలో అన్ని విధాలుగా వెనకబాటుకు గురైన పేద రెడ్ల సం క్షేమం, అభివృద్ధి కోసం రూ.5వేల కోట్ల నిధులతో ప్రత్యేక రెడ్డి కార్పొరేషన్ ను  ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే పేద విద్యార్థులకు విదేశీ ఆర్థిక సాయం కింద రూ.20 లక్షలు అందించాలని తెలిపారు. అంతే కాకుండా పేద రెడ్ల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. వయస్సు 50 సంవత్సరాలు నిండిన ప్రతీ రెడ్డి రైతుకూ పింఛన్ అందచేయాలని కోరారు. ఈ సమావేశంలో రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు అర్జుల కిషన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు రావుల నర్సింహారెడ్డి, జిల్లా నాయకులు వీసం రమణారెడ్డి, మన్నెం ఇంద్రారెడ్డి, ఎంపీటీసీ పోలం కృపాకర్ రెడ్డి, సర్పంచ్ లు  గోగుల సత్యనారాయణరెడ్డి, గట్ల విష్ణు వర్ధన్ రెడ్డి, గురిజాల శ్రీరాంరెడ్డి, పుల్యాల రాణిరఘుపతిరెడ్డిలతో పాటు పోలసాని ఇంద్రారెడ్డి, పలకల శ్రీనివాస్ రెడ్డి, మన్నెం రమణారెడ్డి, పలకల సాంబశివరెడ్డి, మన్నెం రవీందర్ రెడ్డి, గొంది జగన్ మోహన్ రెడ్డి, కొండి మాధవరెడ్డి, ఎన్ రెడ్డి  నర్సింహారెడ్డి, కేతిపెల్లి దేవేందర్ రెడ్డి, దామసాని ప్రవీణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆపదలో ఉన్న మిత్రునికి అండగా

Jaibharath News

మేరి మిట్టి మేర దేశ్ ఇంటింటి నుంచి అమృతమైన మట్టిని సేకరణ

Jaibharath News

కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి నివాళీలు అర్పించిన కాంగ్రెస్ శ్రేణులు

Sambasivarao