గీసుగొండ
*మచ్చాపుర్ లో పర్యటించిన మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..*
*పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులు ప్రారంభం,శంఖుస్థాపన..*
గీసుగొండ మండలం మచ్ఛాపుర్ గ్రామంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించారు.పర్యటనలో భాగంగా రూ.20లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం,రూ.40లక్షలతో గ్రామంలో నూతనంగా వేసిన సీసీ రోడ్లు,రూ.18కోట్ల 80 లక్షలతో మచ్చాపుర నుండి లక్ష్మీపురం వరకు నూతనంగా వేసిన బి.టి.రోడ్డును ప్రారంభించారు.అనంతరం గ్రామంలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన 1192 మంది రైతులకు గాను 1కోటి 13లక్షల 50వేల రూపాయల విలువైన నష్టపరిహారం చెక్కులు పంపిణీ చేశారు.అనంతరం గ్రామంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సొసైటీ, మార్కెట్,రైతుభందు చైర్మన్లు,కమిటీ సభ్యులు,బి.ఆర్.ఎస్.నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.