గీసుగొండ
రెగ్యులరైజ్ చేయాలనే ప్రధాన డిమాండ్ తో సమగ్ర శిక్ష ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న దీక్షలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. బుధవారం కు దీక్షలు 19వ రోజుకు చేరాయి. ఈ దీక్షలకు అన్ని ఉపాధ్యాయ సంఘాలు సంపూర్ణ మద్దతు తెలుపటం తో విద్యాశాఖలో అలజడి మొదలైంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా సంఘీభావం ప్రకటించారు. హన్మకొండ ఏకశిలా పార్కు వద్ద సమగ్ర ఉద్యోగులు చేస్తున్న దీక్ష శిబిరాన్ని పీసీ సీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ రోజు 4 గంటలకు సందర్శించే అవకాశం ఉందని స్థానిక కాంగ్రెస్ నాయకులు అంటున్నారు
next post