జై భారత్ వాయిస్ హన్మకొండ
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహలక్ష్మి పథకం అర్హులందరికీ అందేలా చూస్తామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.బుధవారం పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరకాల, నడికూడ, పరకాల మున్సిపాలిటీ, ఆత్మకూరు, దామెర మండలాల అధికారులతో, ప్రజాప్రతినిధులతో వారు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా గ్రామాలలో గృహలక్ష్మి దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాలలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని కుటుంబం ఉండకూడదని కేసీఆర్ సంకల్పమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి గృహలక్ష్మి పథకం అమలు చేస్తామని అన్నారు.గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారాలు విని ప్రజలెవరు ఆందోళన పడవద్దని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు,కౌన్సిలర్లు,ఎంపీడీవోలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, వార్డు ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.