ఆత్మకూరు లో కేసీఆర్ కు పాలాభిషేకం
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు);
ఆత్మకూరు గ్రామపంచాయతీకి జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి అవార్డు కృషిచేసిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ లకు ఆత్మకూరు గ్రామపంచాయతీ వద్ద పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రేవూరు సుధాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ వంగాల స్వాతి భగవాన్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు పాపని రవీందర్, కో ఆప్షన్ సభ్యుడు ఎండి అంకుస్, గ్రామ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రవీణ్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ బాష బోయిన పైడి , బి ఆర్ ఎస్. నాయకులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆత్మకూరు గ్రామపంచాయతీకి రు.10 లక్షల నిధులు మంజూరు చేశారనీ అన్నారు.ఆత్మకూరు గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఆత్మకూరు గ్రామపంచాయతీ సిబ్బందికి ఉపసర్పంచ్ వంగాల స్వాతి భగవాన్ రెడ్డి , వైసీపీ రేవూరి సుధాకర్ రెడ్డి శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కానుగంటి సంపత్ కుమార్,పూజారి రాము, బాషబోయిన సధానందo,పొగాకుల సంతోష్, రామగిరి రాజ్‌కుమార్, బాషబోయిన ఐలయ్య, జంగా రవి, మాచర్ల సధానందo,మండల తిరుపతి రెడ్డి, రేవూరి జయపాల్ రెడ్డి, ఎర్ర తిరుపతిరెడ్డి,తధితరులు పాల్గొన్నారు.