డాక్టర్ వెంకట్ రాములకు కాకతీయ నంది అవార్డు
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
వైద్య వృత్తిరీత్యా పేదలకు వైద్య సేవలు అందించడంతో పాటు, తన వంతు సహకారం అందిస్తూ విశేష కృషి చేస్తున్న దుర్గంపేట గ్రామానికి చెందిన డాక్టర్ పురాణం వెంకట్రాములు కు కాకతీయ నంది అవార్డును ప్రధానం చేశారు. వరంగల్ లో ఎమ్మెల్యే నాన్నపునేని నరేందర్ అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అవార్డులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా నంది అవార్డు గ్రహీత డాక్టర్ వెంకట రాములు మాట్లాడుతూ సమాజానికి మన వంతు సహాయం చేయడం మానవుని కనీస ధర్మం అని పేర్కొన్నారు. తాను అవార్డుల కోసం ఏనాడు ఆశించలేదని, కేవలం సామాజిక స్పృహతోనే తోచిన సహాయాన్ని సాటివారికి అందించానని పేర్కొన్నారు, అదేవిధంగా ఈ అవార్డుతో తనపై ఇంకా గురుతర బాధ్యత పెరిగిందని పేర్కొన్నారు. ఈ అవార్డుకు ఎన్నిక చేసి అందించిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.