జై భారత్ వాయిస్ దామెర
దామెర ప్రాధమిక ఆరోగ్యకేంద్రములోని దామెర ఊరుగొండ సబ్ సెంటర్ లో డాక్టర్లు మంజుల సాహితీ అద్వర్యములో ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనస్సు Non Communicable diseases) పై అవగాహన కార్యక్రమము నిర్వహించారు
ఈ కార్యక్రమానికి హనుమకొండ జిల్లా డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ యాకుబ్ పాష మాస్ మిడియా అధికారి అశోకరెడ్డి హజరైనారు. ఈ సందర్భంగా డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్. యాకుబాషా మాట్లాడుతూ గర్భిణీస్త్రీలు 84 రోజుల లోపు రిజిస్ట్రేషన్ చేసుకొని టిడి ఇంజెక్షన్ తీసికొనాలని గర్భీణిస్త్రీలలో రక్తహీనత రాకుండా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండలంటే. పౌష్టిక ఆహారం తీసికొవాలని సూచించారు
గవర్నమెంట్ హస్పటల్స్ నందు ప్రసవము జరగాలి అని సూచించినారు. అదే విధంగా 30 సం||లు దాటిన ప్రతి ఒకరు B.P షుగర్ పరీక్షలు చేయించుకొనిష BP, సుగర్ ఉన్నవాళ్ళు అందరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రము మండలంలోని అన్ని సబ్ సెంటర్ నందు మందులు తీసుకోవాలి అన్నారు వైద్య పరీక్షలు చేసిన వారికి మందులను పంపిణీ చేశారు . ఈ సేవలను ప్రతి ఒకరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మరియు ICDS నందు పోషణ మాసం సందర్భంగా కిషోర బాలికలు గర్భిణీ స్త్రీలను బాలింతలు చూలింతలు పౌష్టికాహారం తీసుకోవాలని ఈ కార్యక్రమములో మాస్ మీడియా అధికారి అశోకడ్డి, సూపర్వైజర్ శ్రీకాంత్, పద్మ, శోభారాణి ANM’S, ఆశా వర్కర్స్ మరియు అంగన్వాడి టీచర్స్ పాల్గోన్నారు అనంతరం దామర ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఊరుగొండలో హెల్త్ వెల్నెస్ సెంటర్ కోసము నూతనంగా నిర్మిస్తున్న భవణంను సందర్శించారు.
next post