జై భారత్ వాయిస్ ఆత్మకూర్
ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వెల్నెస్ సెంటర్లో ఆయుష్మాన్ భవ ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని డాక్టర్ శశి కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి వైద్య సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఆయన సూచించారు ప్రతి ఒక్కరూ ఆయుష్మాన్ భవ కార్డును పొందాలని అన్నారు పెద్దాపూర్ గూడపాడు గ్రామాలలో ఏ సి ఎఫ్ ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు ఒకరు పౌష్టిక ఆహారం తీసుకోవాలని అనారోగ్యం బారిన పడ్డ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వెల్నెస్ సెంటర్లలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు నిర్వహించుకుని మందులు వాడాలని కోరారు ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్స్ హెల్త్ అసిస్టెంట్స్ ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు