జై భారత్ వాయిస్ ఆత్మకూరు)
భాద్రపద శుద్ధ చవితి మొదలుకొని నిర్వహిస్తున్న గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఆత్మకూరు మండలంలో గణపతులు మండపాల్లో ఘనంగా పూజలు అందుకుంటున్నారు. ఆత్మకూరు మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో హిందూ ధర్మ రక్షణ సమితి ఆధ్వర్యంలో శనివారం భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. అలాగే మోడల్ కాలనీ లో ఏర్పాటు చేసిన గణపతికి , ఆత్మకూరు సి ఐ రవిరాజ్, ఎస్ ఐ ప్రసాద్ , పోలీసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాధులకు మంగళహారతులు పూలు కొబ్బరికాయలు నైవేద్యాలతో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురోహితులు ఆరుట్ల కేశవమూర్తి భక్తులచే గణపతికి పూజలు నిర్వహించారు. పాత బస్టాండ్ సమీపంలో ఆదివారం సాయంత్రం మహానదానం కార్యక్రమం నిర్వహించబడుతుందని భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి గణపతిని దర్శించుకుని మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాద్వీకరించవలసిందిగా ఉత్సవ సమితి నిర్వాహకులు కొంపెల్లి రాజమౌళి,వడ్డేపల్లి రాజు, మార్త రంజిత్ కందకట్ల విజయ్, కొంపెల్లి రవి, కొంపెల్లి సంజీవ్, వెల్ది జ్ఞానేశ్వర్ ,వెల్దే కపిల్, కొంపెల్లి మణికుమార్ తదితరులు తెలిపారు.
previous post