గృహలక్ష్మి లబ్దిదారులకు మంజూరు పత్రాలు అందించిన
*ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..*
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు)
కాంగ్రెస్ హయాంలో పేదలకు తీవ్ర అన్యాయం జరిగిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
ఆదివారం ఆత్మకూరు మండల కేంద్రంలోని జి.ఎస్.ఆర్.గార్డెన్స్ లో ఆత్మకూరు మండలం,డామెర మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 428 మంది గృహలక్ష్మి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు వారు అందచేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ…
-పేదవారి సొంతింటి కళ నెరవేర్చేందుకే సంకల్పించి సిఎం కేసీఆర్ గ్రహాలక్ష్మి ప్రత్యేకం ప్రవేశపెట్టారని అన్నారు.
– గతంలో మన నియోజకవర్గంలో ప్రభుత్వం అందించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా నిర్మించుకున్నామని చెప్పారు.
– అవినీతికి తావివ్వకుండా,పారదర్శకంగా గృహలక్ష్మి పథకంలో లబ్ధిదారుల ఎంపిక చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులను అభినందిస్తున్నానీ చెప్పారు..
– గృహలక్ష్మి పథకంపై ప్రతిపక్షాలు ఎన్నో అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని వారి మాటలు ప్రజలు నమ్మవద్దు అని చెప్పారు.
– అర్హులైన ప్రతి ఒక్కరికి గృహలక్ష్మి పథకం వర్తింప చేస్తామని తెలిపారు
– గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ.లబ్ధిదారులకు మూడు దపాలలో మూడు లక్షలు నేరుగా బ్యాంకు ఖాతాకు జమచేయడం జరుగుతుందని పేర్కొన్నారు
నేడు కేసీఆర్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని
– ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా పారదర్శకంగా ప్రజలకు నేరుగా లబ్ధిదారులకు చేరవెస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదని చెప్పారు
– ప్రజలు గమనించాలని పది సంవత్సరాల క్రితం తెలంగాణ ఎట్లా ఉండే,ఎంత గొసపడ్డాం..ఇప్పుడు తెలంగాణాలో కేసీఆర్ కృషితో ఎలా ఉందో ఆలోచించాలి..
– తెలంగాణ ఏర్పడితే ఎడారి అవుతుందని ఆంధ్రపాలకు అన్నారు.నేడు కేసీఆర్ గారు తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారు.
– నేడు బి.ఆర్.ఎస్.ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న బిజెపి,కాంగ్రెస్ పార్టీల నాయకులు తెలంగాణకు ఏమిచేశారో ప్రజలకు చెప్పాలి లేకుంటే వారికి ప్రజల చేతుల్లో గుణపాఠం తప్పదు..
– వ్యవసాయం దండగ అని గత ఆంధ్రా పాలకులంటే..వ్యవసాయం ఒక పండగలా నిర్వహించేలా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది.
– గత ప్రభుత్వాలు ఏండ్లకేoడ్లు అధికారంలో ఉండి ప్రజలను,రైతులను పట్టించుకున్న దాఖలాలు లేవు.
– వ్యవసాయానికి 3 గంటల కరెంటు చాలని కాంగ్రెసోళ్ల అవగాహన లేని మాటలు,బావుల కాడ మీటర్లు పెట్టాలని బిజెపి వాళ్ళ అంటున్న వారి తీరుతో తెలుస్తుంది రైతులపై వారికున్న కపట ప్రేమ.
– తెలంగాణలో మాయమాటల కాంగ్రెస్,తెలంగాణ ద్రోహిగా నిలిచిన బిజెపి పార్టీల అడ్రస్ గల్లంతు అవ్వడం ఖాయం.
– ప్రజల గుండెల్లో ఉన్న కేసీఆర్ గారిని ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసిన ఏమిచేయలేరని,మూడో సారి బి.ఆర్.ఎస్.ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, సొసైటీ, మార్కెట్ చైర్మన్లు, కమిటీ సభ్యులు, రైతుబందు కన్వీనర్లు,లబ్ధిదారులు,బి. ఆర్.ఎస్.నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.