పరకాల నియోజకవర్గంలో కాకతీయులు కట్టిన చెరువులను కొల్లగొట్టేది పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అని మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి అన్నారు. ఆదివారం నియోజకవర్గంలో 16 డివిజన్ కీర్తి నగర్, గొర్రెకుంటలో బిజెపి నాయకులు డాక్టర్ కాళి ప్రసాద్ కట్ట మల్లన్న ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకుని 16వ డివిజన్లో ఇంటింటికి వెళ్లి బిజెపి చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి రాబోయే ఎన్నికలలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని బలపరచాలని కోరారు. తదనంతరం విలేకరుల సమావేశం నిర్వహించగా ఆ సమావేశానికి ముఖ్యఅతిథిగా పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగురు బిక్షపతి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ కోసం విద్యార్థులు ప్రభుత్వాలతో కొట్లాడి ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ ప్రభుత్వం తెచ్చుకుంటే నేడు బలిదానాలు చేసిన అమరవీరుల కుటుంబాలను రోడ్డు పాలు చేసి, తెలంగాణ విద్యార్థుల జీవితాలను అగమ్య గోచరంలో పడేసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం పాలన సాగిస్తుందని అన్నారు. తెలంగాణ వస్తే నిరుద్యోగ సమస్య పోతుందని తెలంగాణలో పార్టీలకతీతంగా అందరూ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధిస్తే నేడు విద్యార్థులకు నిరుద్యోగ సమస్యతో ఆత్మహత్య లు శరణ్యమయే పరిస్థితి దాపురించిందని ఆగ్రహించారు. గ్రూప్ వన్ పరీక్షలను ఎలా నిర్వర్తించాలో తెలవని తెలంగాణ ప్రభుత్వం ఒకసారి పరీక్ష నిర్వహించి ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంతో రద్దుచేసి, రెండోసారి పరీక్షలు నిర్వహించి మళ్లీ రద్దు చేయడంతో విద్యార్థుల జీవితాలు సందిగ్ధంలో పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కాకతీయులు కట్టించిన చెరువులను కొల్లగొడుతున్నాడని, చల్ల ఇన్ఫ్రా సంస్థతో చెరువుల మట్టిని తీసి రోడ్లు పోయడం దానితో రెండు వేల కోట్ల రూపాయలు సంపాదించాడని అన్నారు. ఇప్పటికే చల్లా ధర్మరెడ్డి ఓటర్లకు 10,000 రూపాయలు, తులం బంగారం ఇచ్చేందుకు ప్రణాళికలు తయారు చేసుకున్నాడని అవి తీసుకొని పరకాల నియోజకవర్గం ప్రజలు ఎమ్మెల్యే చల్లాను తరిమేందుకు సిద్ధమయ్యారని అన్నారు. గొర్రెకుంట ధర్మారం, కీర్తి నగర్ జిహెచ్ఎంసిలో విలీనమై ఏమాత్రం అభివృద్ధి చెందకుండా సరైన వీధిలైట్లు, సీసీ రోడ్లు లేకపోవడంపై ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి స్వార్ధ రాజకీయాల కోసం, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కుట్ర కుతంత్రాలతో ప్రజల ముందుకు వస్తారని ప్రజలు ఎవరు వారి మాయల ఫకీరు మాటలు నమ్మొద్దని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికలలో పరకాల నియోజకవర్గంలో బిజెపి ప్రభుత్వం రావడం ఖాయమని ప్రజలందరి ఆశీర్వాదంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు.
previous post
next post