పెద్దాపురం లో గృహలక్ష్మీ మంజూరు పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టునేందుకు ఆర్థికంగా ఆదుకోవాలని అన్ని నియోజవర్గాలకంటే మన నియోజకవర్గంలో ముందే ఇల్లు కట్టుకునే వారి కల నెరవేరాలని ఎక్కడ అవినీతి జరుగకుండా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గృహలక్ష్మీ ,పథకంలో భాగంగా ఆత్మకూర్ మండలం పెద్దాపూర్ గ్రామంలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశామని ఆత్మకూరు మండల బి ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి బొల్లోజు కుమార స్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్ పీ టి సీ కక్కెర్ల రాధిక-రాజు ,స్థానిక సర్పంచ్ సావురే కమల-రాజేశ్వరరావు పంచాయతీ కార్యదర్శి రవికుమార్ ఉపసర్పంచ్ కక్కెర్ల వనమాల-సుధాకర్ బి అర్ ఎస్ నాయకులు వేముల నవీన్,లకిడే రాజమల్లాజీ, వేల్పుల గణేష్ పాల్గొన్నారు.