Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

గణేష్ నిమజ్జ నానికి ఏర్పాట్లు పూర్తి ఈస్ట్ జోన్ డిసిపి రవీందర్

గణేష్ నిమజ్జనానికి పటిష్ట భద్రత*
*ఈస్ట్ జోన్ డిసిపి రవీందర్*
– పోలీస్ రెవెన్యూ అధికారులకు పలు సూచనలు
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు)!

గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ఆత్మకూరు మండలం లో ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకున్నామని, ప్రజలు,భక్తులు సహకరించాలని ఈస్ట్ జోన్ డిసిపి రవీందర్ కోరారు. మంగళవారం మండలం లో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న కటాక్షపూర్ పెద్ద చెరువును,నిమజ్జనం జరిగే ప్రదేశాలను ఈస్ట్ జోన్ డిసిపి స్థానిక సిఐ రవిరాజు,తహసీల్దార్ సురేష్ కుమార్, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లతో పాటు, గణేష్ ప్రతిమలను నిమజ్జనం చేసేందుకు గాను క్రేన్ల వినియోగం,రోడ్డు మరమ్మత్తులు పరిశీలించిన డిసిపి సంతృప్తి వ్యక్తపరిచారు. నిమజ్జనం జరిగే సమయంలో పోలీస్, రెవెన్యూ అధికారులు నిర్వహించాల్సిన విధులతో పాటు,ప్రతిమలను తీసుకువచ్చే వాహనాల ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి, అనంతరం వాహనం తిరిగి వెళ్ళే మార్గాలకు సంబంధించిన విషయాలపై డిసిపి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డిసిపి రవీందర్ మాట్లాడుతూ గణేష్ నవరాత్రులకు సంబంధించి కట్టుదిట్టమయిన చర్యలు తీసుకున్నామని అన్నారు. గణేష్ మండపాల నిర్వహకులంతా మంచి కండిషన్ లో ఉన్న వాహనాలను మాత్రమే శోభాయాత్రకు వినియోగించాలని సూచించారు. ఆధ్యాత్మిక వాతావరణం ఉండే విధంగా చూడాలని, మద్యం సేవించి శోభాయాత్రలో పాల్గొనవద్దని వాహనాలు నడిపేవారు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు.రెవెన్యూ, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Related posts

ఆత్మకూరు సీఐగా క్రాంతికుమార్ బాధ్యతల స్వీకరణ

Jaibharath News

28న ఉచిత ధ్యాన శిక్షణ

మహిళా ఉద్యోగులు బతుకమ్మ వేడుకలు