Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ ల పంపిణీ.

భారత్ వాయిస్ గీసుకొండ
వరంగల్ జిల్లా, గీసుగొండ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బాలికలకు లర్నింగ్ కర్వ్ సంస్థ ఆధ్వర్యంలో జి సి డి ఓ ఫ్లోరెన్సా స్కూల్ బ్యాగ్ ల పంపిణీచేశారు.. లర్నింగ్ కర్వ్ అనే స్వచ్ఛంద సంస్థ వారు 6వ, 7వ మరియు 8వ తరగతి పిల్లలకు స్కూల్ బ్యాగులు ఉచితంగా పంపిణీ చేసారు. KGBV పిల్లల అవసరాన్ని తెలుసుకొని వారిని ప్రోత్సహించేందుకు సామాజిక భావోద్వేగా నైపుణ్యాల (SEL ) శిక్షణ కార్యక్రమం తో పాటుగా పిల్లలకు స్కూల్ బ్యాగులు, నోటు పుస్తకాలు, పెన్సిల్స్, ఇత్యాది స్టేషనరీ వస్తువులని పంపిణీ చేశారు.పాఠశాలలో విద్యార్థుల మానసిక ఎదుగుదలతొ పాటు ఇలా అన్ని రకముల సహాయ సహకారాలను అందిస్తున్న లర్నింగ్ కర్వ్ సంస్థకు ప్రతినిధులను ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమం జి సి డి ఓ ఫ్లోరెన్సా, ఎస్ ఓ హిమబిందు, సీ ఆర్టీ లు రజిని, శోభ, శోభారాణి, లర్నింగ్ కర్వ్ సంస్థ సీనియర్ ప్రోగ్రామ్ అసోసియేట్ తులసి తదితరులు పాల్గొన్నారు.

Related posts

కుమార్ ఆమరణ దీక్ష… క్షీణిస్తున్న  ఆరోగ్యం

మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి పరామర్శ

Sambasivarao

గీసుకొండ మండలంలో పదవ తరగతి వార్షీక పరీక్షలు ప్రశాంతం ఎంఈఓ సత్యనారాయణ