దామెర మండలంలో పలు గ్రామాల్లో ముస్లింలు మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా గురువారం దామెర మండలం ఒగ్లాపూర్ లోని సైలానిబాబా దర్గా అవరణలో పీఠాధిపతి హమీద్ షా మియా (సైలానీబాబా) ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఈ నేపథ్యంలో ఆత్మకూరు మండలంలోని మజీద్ వరకూ మిలాద్-ఉన్-నబీ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుంచి ఒగ్లాపూర్ లోని సైలానిబాబా దర్గా అవరణలో పీఠాధిపతి హమీద్ షా మియా సమక్షంలో బైక్ వ్యాలీ ముగించారు. సైలానిబాబా దర్గా ప్రాంగణాల్లో ప్రత్యేక నమాజ్, ప్రార్థనలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఇతర ప్రాంతాల నుంచి పీఠాధిపతులు నవీద్ బాబా, రషీద్ బాబా, అమెర్ బాబా, ఎస్.కె.మోయిన్(ఖాదీమ్-ఏ-సైలానియా) అహ్మద్, తదితరులు పాల్గొన్నారు. అలాగే ఊరుగొండలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జాకీర్, మజీద్ పెద్దలు పాల్గొన్నారు.
previous post
next post