Jaibharathvoice.com | Telugu News App In Telangana
పెద్దపల్లి జిల్లా

బిజెపికి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ

జైభారత్ వాయిస్ రామగుండం
పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఎమ్మెల్యేగా గెలుపొందారు.2016 లో ఆర్టీసీ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టారు.2018 లో బిఆర్ఎస్ ఎమ్మెల్యే గా పోటిచేసినా సత్యనారాయణ స్వతంత్ర అభ్యర్థి కోరుకంటి చందర్ పై ఓటమి చెందారు. ఆ తర్వాత బిజెపిలో చేరినా సత్యనారాయణ బిజెపి లో ఉంటే ఓట్లు పడవని నెపంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.రామగుండం ప్రజలు నన్ను కోరుకుంటున్నారని,మరోసారి అభివృద్ధి చేసి చూపిస్తాను అని సత్యనారాయణ చెప్పారు.