Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

మరణించిన పోలీస్ కుటుంబానికి భద్రత చెక్కు అందజేసిన సిపి

జై భారత్ వాయిస్ హన్మకొండ

కంగా మరణించిన పోలీస్ కానిస్టేబుల్ కుటుంబానికి పోలీస్ భద్రత నుండి మంజూరైన చెక్కును వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ శనివారం అందజేసారు. వివరాల్లోకి వెళితే సివిల్ కానిస్టేబుల్ కె. క్రాంతి కుమార్ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతూ గత మే 05వ తేదీన మరణించడంతో తెలంగాణ పోలీస్ భద్రత పథకం ద్వారా మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి మంజూర్ చేసిన 7లక్షల 84 వేల 460 రూపాయలమంజూరు చెక్కులను పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా మరణించిన కానిస్టేబుల్ భార్యకు అందజేసారు, ఈ సందర్భంగా మరణించిన కానిస్టేబుల్ స్థితిగతులపై ఆరా తీయడంతో పాటు, శాఖపరంగా రావల్సిన బెనిఫిట్లను అందజేసేందుకు తక్షణ చర్యలు గైకొనాల్సిందిగా పోలీస్ కమిషనర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమములో పరిపాలన విభాగం ఇంచార్జ్ అదనపు డీసీపీ రాగ్యానాయక్,సూపరింటెండెంట్ యుగేందర్, పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధి శోభన్ గౌడ్ పాల్గోన్నారు.

Related posts

భక్తజనంతో కిటకిటలాడిన అగ్రంపహాడు జాతర -కిక్కిరిసిపోయిన క్యూలైన్లు

Jaibharath News

గురుకుల్ ది స్కూల్ లో అంబరాన్ని అంటిన బతుకమ్మ సంబరాలు

స్టాటిస్టికల్ సర్వేలెన్సు చెక్ పోస్ట్ ను హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీ

Jaibharath News