Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

పింగిళి కళాశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

జై భారత్ వాయిస్ హనుమకొండ)
హనుమకొండలోని పింగిళి డిగ్రీ కళాశాలలో 1996-99 సంవత్సరంలో చదివిన విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. అపూర్వ కలయికతో మళ్లీ ఒక రోజు అనే సందేశంతో విద్యార్థులు తమ స్నేహితులతో పాటు  పింగిని కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సుహాసిని, అల్యూమినించార్జ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్యామల ముఖ్యఅతిథిగా  కార్యక్రమానికి హాజరయ్యారు. తాము చదువుకున్న సమయంలో అధ్యాపకులు బోధించిన తీరును వారు ఇచ్చిన సందేశాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ తమ జీవితాన్ని నిలబెట్టుకునే విధంగా చేసిన విధానాన్ని ఒకరికొకరు పంచుకున్నారు. నాటి విద్యార్థులమంతా నేడు వివిధ ప్రాంతాల్లో స్థిరపడి జీవనం సాగిస్తూ మళ్లీ కళాశాలలోకి రావడంతో ఆనాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయని మహిళలు తెలిపారు.

Related posts

ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి! హనుమకొండ జిల్లా కలెక్టర్

Jaibharath News

అన్ని వర్గాల అభ్యున్నతి కోసమే కుల గణన- పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి

సైలానీ బాబా దర్గాను దర్శించుకున్న ఎమ్మెల్యేలు

Jaibharath News