Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

తల్లిదండ్రులను కోల్పోయి… అనాధలుగా మిగిలిన చిన్నారులకు అండగా నిలిచిన పెగళ్ళపాటి లక్ష్మినారాయణ

నర్సంపేట మండలంలోని మహేశ్వరం గ్రామంలో ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాధలైన విషాద సంఘటన నెలకొంది. మహేశ్వరానికి చెందిన బండి సురేష్ – మానస దంపతులకు సుస్వర (12), అభిరామ్ (10) ఇద్దరు పిల్లలు ఉన్నారు. తండ్రి సురేష్ కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోగా, తల్లి మానస పాము కాటుతో వారం క్రితం మరణించారు. ఈ సంఘటనతో ఆ ఇద్దరు పిల్లలు అనాధలుగా మిగిలి, కడు దయనీయస్థితిలో ఉన్న విషయాన్ని తెలుసుకున్న గీసుకొండ గ్రామానికి చెందిన రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ పెగళ్ళపాటి లక్ష్మినారాయణ మానవత్వంతో స్పందించి, ఆ పిల్లలకు రూ5000/- ల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వీరివెంట మందపల్లి పాఠశాల హెడ్మాస్టర్ కర్ణకంటి రాంమూర్తి, ఉపాధ్యాయులు పసుల శివన్నారాయణ, స్థానికులు దార రాజేందర్,రాంరాజ్, సతీష్, అశోక్,గొల్ల స్వామి,దండె రాజు,పత్తెపు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

విద్యార్థులు ఇష్టపడి చదవాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి*

Jaibharath News

అభిమాని  ఇంటికే ఓ ప్రముఖ హీరో ఎవరూ ఆ హీరో