మీడియా రక్షణ చట్టాన్ని అమలు చేయాలి
-జర్నలిస్ట్ కమిటీ అధ్యక్షులు సముద్రాల విజేందర్.
(జై భారత్ వాయిస్
ఆత్మకూరు): దేశవ్యాప్తంగా జర్నలిస్టు రక్షణ కొరకు జర్నలిస్ట్ రక్షణ చట్టాన్ని అమలు చేయాలని ఆత్మకూరు జర్నలిస్ట్ కమిటీ అధ్యక్షులు సముద్రాల విజేందర్ అన్నారు. సోమవారం ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్( ఐజేయు) రాష్ట్ర జిల్లా కమిటీ లు ఇచ్చిన పిలుపుమేరకు ఆత్మకూర్ జర్నలిస్ట్ కమిటీ ఆధ్వర్యంలో తహశీల్ధార్ కాకార్యాలయం లో వినతి పత్రాన్ని సమర్పించి కార్యాలయం ముందు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజేందర్ మాట్లాడుతూ జర్నలిస్టుల రక్షణ చట్టంతోపాటు కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు.
అలాగే రైల్వే పాస్ లను పునరుద్ధరణ చేయాలని జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు ఆత్మకూర్ జర్నలిస్ట్ కమిటీ ప్రధాన కార్యదర్శి ముదిగిరి ఓదేలు, ఉపాధ్యక్షులు కొండ బత్తుల వేణుగోపాల్ ,సహాయ కార్యదర్శి కందగట్ల రాము ,కోశాధికారి సముద్రాల సురేష్, సభ్యులు పత్తిపాక చంద్రశేఖర్ ,వెల్దే లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.