(జై భారత్ వాయిస్ వరంగల్)
భూపాలపల్లి వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా నియమితులైన వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ప్రోగ్రామ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న డాక్టర్ చల్లా మధుసూదన్ ను వరంగల్ జిల్లా టిఎన్జీఓ స్ పక్షాన జిల్లా అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు అందరూ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేయడం తెలిపారు.
ఈ సందర్భంగా టిఎన్జీఓస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో ప్రోగ్రాం ఆఫీసర్ గా పని చేస్తూ ఉన్నత అధికారుల మన్ననలు పొందిన డాక్టర్ చల్లా మధుసూదన్ పదోన్నతిపై భూపాలపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా వెళ్లడం సంతోషదాయకమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గాజే వేణుగోపాల్, కోశాధికారి పాలకుర్తి సదానందం, ఉపాధ్యక్షులు మురళీధర్ రెడ్డి, గద్దల రాజు, సిటీ అధ్యక్షులు వెలిశాల రాజు, జిల్లా సంయుక్త కార్యదర్శి వంగ రవీందర్, త్రివేణి, రామకృష్ణ, పాలకుర్తి మధు, మెడికల్ ఫోరం అధ్యక్ష కార్యదర్శులు మాడిశెట్టి శ్రీనివాస్, రజనీకాంత్, విద్యాసాగర్ రెడ్డి, రాధిక, పృథ్వి, రాజ్ కుమార్, ఆఫీస్ సూపరింటెండెంట్ వేణుగోపాల్, సంగెం యూనిట్ అధ్యక్షులు కిరణ్ కుమార్, కుమార్, శ్రీకాంత్, విజయ్, సుదర్శన్, గౌస్, షమీమ్ సుల్తాన తదితరులు పాల్గొన్నారు.