హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని రసూల్ పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ కన్నెబోయిన కళ ఆధ్వర్యంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికి బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కుమారస్వామి వార్డు సభ్యులు సతీష్, రేణుక కరోబర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
previous post