April 9, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మేల్యే ధర్మా రెడ్డి

*నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):

ఆత్మకూరు మండలం అక్కంపెట గ్రామంలో శుక్రవారం ఉదయం స్థానిక శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి గారు పర్యటించారు. పర్యటనలో భాగంగా గ్రామంలో 16లక్షల రూపాయాలతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభం చేశారు.ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ..
బి.ఆర్ ఎస్.ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే మళ్ళీ గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.మోసపూరిత మాటలతో గ్రామాల్లోకి వస్తున్న కాంగ్రెస్, బిజెపి నాయకులను తెలంగాణకు ఎంచేసారో తెలపాలని నిలదీయాలని ప్రజలకు సూచించారు.తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బిజెపి,కాంగ్రెస్ పార్టీలు పరిపాలిస్తున్న రాష్ట్రాలలో లేవన్నారు.అక్కడ అధికారంలో ఉంది చేయలేని పార్టీలు ఎన్నికలు రాగానే ఇక్కడ సాధ్యం కానీ హామీలు ఇస్తూ ప్రజలను మోసంచేయాలని చూస్తే వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అన్నారు.ప్రతిపక్షాలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా మూడోసారి బి.ఆర్.ఎస్. గెలుపును అడ్డుకోలేరని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ విజయ హంసల్ రెడ్డి, మార్కేట్ చైర్మన్ రాధా రవి యాదవ్,జెడ్ పిటి సి రాధిక, రాజు, ఎంపీపీ సుమలత, ఎం పీ ఈ ఓ చేతన్ రెడ్డి, మండల అధికార ప్రతినిధి రెగుల కిషోర్, తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, సొసైటీ, మార్కెట్ చైర్మన్లు, కమిటీ సభ్యులు,రైతు బంధు కన్వీనర్లు, సభ్యులు,బి.ఆర్.ఎస్.నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

Chaitanya digree college technovista చైతన్య డిగ్రీ కాలేజీలో టెక్నో విస్టా

ఆత్మకూరులో ఘనంగా పెత్ర మాస బతుకమ్మ

అక్కంపేట ఇక రెవెన్యూ గ్రామం

Jaibharath News