Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఎమ్మెల్యే  ధర్మారెడ్డిని మరోసారి గెలిపించాలి

జైభారత్ వాయిస్ గీసుకొండ
ఎమ్మెల్యే  ధర్మారెడ్డిని మరోసారి గెలిపించాలని గీసుకొండ జడ్పీటిసి ధర్మారావు మండల పార్టీ అధ్యక్షులు రాజుకుమార్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.గీసుకొండ మండలం లోని కొమ్మాల, సూర్య ,తండా విశ్వనాధపురం, నంద నాయక్ తండ  దసురు తండా  మచ్చాపూర్  అర్జతండా, అనాంతరం,గ్రామాల బిఆర్ఎస్ గ్రామకమిటీల అధ్యక్షతన ముఖ్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా మండల సమన్వయ కమిటీ సభ్యులు బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వీరగొని రాజకుమార్ ప్రధాన కార్యదర్శి చల్ల వేణుగోపాల్ రెడ్డి జెడ్పిటిసి పోలీస్ ధర్మారావు హజరైనారు.

ఈ సందర్బంగా వారు  మాట్లాడుతూ త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో  ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించే విధంగా ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఓటరుకు వివరించే విధంగా సమయాత్తం కావాలని అన్నారు.అనంతరం బూత్ కన్వీనర్, కో కన్వీనర్ మెంబర్స్ ను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో  సర్పంచులు బోడకుంట్ల ప్రకాష్ గోనె మల్లారెడ్డి పుండ్రు జపాల్ రెడ్డి డోలే చిన్ని అంకతి నాగేశ్వరరావు జక్కు మురళి గీసుకొండ మండల యూత్ అధ్యక్షులు సిరిషే శ్రీకాంత్ లెనిన్ చల్ల రాజు కుమార్  8 గ్రామాల గ్రామ పార్టీ అధ్యక్షులు కార్యదర్శిలు వివిధ కమిటీల సభ్యులు పాల్గొన్నారు.

Related posts

వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం

డాక్టర్ మధుసూదన్ కు అభినందనలు

Jaibharath News

సర్వశిక్ష ఉద్యోగుల వినూత్న నిరసన

Jaibharath News