Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

మెరుగైన వైద్య సేవలు అందించాలి

జై భారత్ వాయిస్ ఆత్మకూర్
గ్రామీణ ప్రాంతంలోని
పల్లెదవఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర  హెల్త్ వెల్ నెస్ కేంద్రాల నోడల్ అధికారి జివి  శ్రీనివాసరావు వైద్య సిబ్బందికి సూచించారు. ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామంలో పల్లె దావఖానాను శనివారం నాడు సందర్శించారు పల్లె దవఖానలో అందిస్తున్న వైద్య సేవలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు రాబోయే రోజుల్లో పల్లె దావఖానలో ఎలాంటి వైద్య సేవలు అందించాలో ప్రస్తుతము ఆస్పత్రిలో అందిస్తున్న సేవలను ఎలా మెరుగుపరచుకోవాలో సూచించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ యాకుబ్ పాషా, డిపిఓ శ్రీనివాస్,  డెమో అశోక్ కుమార్ , ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి స్పందన వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Related posts

పేకాట రాయుళ్లు అరెస్టు

వెంటిలేటరు మీద చికిత్స లో తెలంగాణ ఉద్యమకారుడు-ఆదుకోవాలని కుటుంబ సభ్యుల వినతి

అంబేద్కర్ జ్ఞాన యాత్రను విజయవంతం చేయండి వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్ రావు పిలుపు