(జై భారత్ వాయిస్ ఆత్మకూర్ )
పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు అర్షం విక్రమ్ పరకాల ఎమ్మెల్యే అభ్యర్థి,తాజా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు.వారికి గులాబీ కండువాకప్పి సాదరంగా ఆహ్వానించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీకి విధేయతగా పనిచేసే వారికి ఖచ్చితంగా పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని,నియోజకవర్గంలోని చాలా మంది యువత కు ప్రత్యేక స్థానం కల్పించామని తెలిపారు..పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేక విధానాలు కొనసాగిస్తే చర్యలు తప్పవని అన్నారు.ఈ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ అర్షం బలరాం , గ్రామ పార్టీ అధ్యక్షుడు మానగాని సాంబమూర్తి , సీనియర్ నాయకులు ఓదెలా రమేష్, మండల ప్రధానకార్యదర్శి బొల్లోజు కుమారస్వామి,మాజీ మార్కెట్ చైర్మన్ కాంతాల కేశవరెడ్డి,వార్డు మెంబర్ లు ,యూత్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
previous post