హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లో బీఏ బీకాం బీఎస్సీ మూడవ, ఐదవ, సెమిస్టర్ పరీక్షలు 14వ తేదీ మంగళవారం నుండి ప్రారంభమవుతున్నట్లు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య బన్న ఐలయ్య ఒక ప్రకటన తెలిపారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించబడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ పరీక్షలు డిసెంబర్ 8వ తేదీ వరకు నిర్వహించబడతాయని ప్రిన్సిపల్ వివరించారు.