Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

42వ డివిజన్లో కార్పొరేటర్ “గుండు చందన పూర్ణచందర్ బిఆర్ఎస్ ప్రచారం

జై భారత్ వాయిస్ రంగశాయపేట
  బి.ఆర్.ఎస్. పార్టీ వరంగల్ తూర్పు అభ్యర్థి *నన్నపునేని నరేందర్ ను గెలిపించాలని కోరుతూ 42 వడివిజన్లోని 19-9, 19-8, 17-10 బ్లాక్ లలో కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్  స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా గుండు చందన పూర్ణచందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్  చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తుంటే ప్రజల నుండి మంచి స్పందన వస్తున్నదని అన్నారు. ప్రజలంతా కారు గుర్తుకు ఓటు వేసి వరంగల్ తూర్పు అభ్యర్థి నన్నపునేని నరేందర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
 ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జ్ కొంతం మోహన్, డివిజన్ అధ్యక్షులు కర్ర కుమార్, నాయకులు ముత్తినేని రామమూర్తి, కొక్కొండ భాస్కర్, పాల రంజిత్, అంబటి రమ, బక్కి వంశీ, కన్నెబోయిన కుమార్, ఆడపు రఘు, విలాసాగరం సంధ్య, పేర్న రవి తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

శాయంపేట హవేలీలో పంచాల రాయలస్వామి కళ్యాణం

ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన రేవూరి టీం

Sambasivarao

టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో కాళోజి జయంతి వేడుకలు