హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య బన్న ఐలయ్య అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాణ పునాది రాయి అని. దేశంలో సామాజిక ఆర్థిక అసమానతలను నిర్మించడంలో అంబేద్కర్ ఎనలేని కృషి చేశారని. సమాజంలో నెలకొన్న అనేక రుగ్మతులను రూపుమాపుటకు రాజ్యాంగంలో పేర్కొన్న హక్కులను బడుగు బలహీన వర్గాలు నేడు అనుభవిస్తున్నారని ఆయన అన్నారు. ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని అందించిన గొప్ప నాయకుడు అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ కర్ణాకర్ రావు. డాక్టర్ శ్రీధర్, డాక్టర్ పుల్లా రమేష్, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ శేషు, డాక్టర్ చారి, డాక్టర్ స్వామి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.