జై భారత్ వాయిస్ గీసుకొండ
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన *సోనియా గాంధీ* తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిందని,అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి తెలంగాణ ప్రజలు ఆమె రుణం తీర్చుకున్నారని గీసుకొండ మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు.శనివారం వరంగల్ జిల్లా గీసుగొండ మండలం కొనాయమాకూల క్రాస్ వద్ద పరకాల శాసనసభ్యులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలుఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్బంగా మండల పార్టీ అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాస్ తోపాటు కాంగ్రెస్ నాయకులు చాడ కొమురారెడ్డి, దూల వెంకన్న,ఎంపీపీ బీమాగాని సౌజన్య,వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరపు స్వామిలు మాట్లాడుతూ సోనియా గాంధీ జన్మదినం రోజునే తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం,రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచితంగా 10 లక్షల వైద్య సౌకర్యం కల్పించడం సంతోషంగా ఉందన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని,రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని ప్రజాఅమోద్యమైన జనరంజక పాలన కొనసాగుతుందన్నారు.అవినీతి అక్రమాలకు తావులేకుండా ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు కృషి చేస్తుందన్నారు.ప్రజల దీవెనలతో తల్లి సోనియమ్మ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ప్రధాన కార్యదర్శి కూసం రమేష్,ఎండి జావిద్, ఎంపీటీసీలు మనిగోపాల్,భరత్ కోమల,కో ఆప్షన్ నెంబర్ ఎండి రహీం,గీసుకొండ మండల యూత్ అధ్యక్షులు ఆకుల రుద్ర ప్రసాద్, బీసీ సెల్ మండల అధ్యక్షులు వజ్రా రాజు,గీసుకొండ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సరిత, కొనాయమాకుల గ్రామ పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్,గీసుకొండ మండల నాయకులు అల్లం మర్రెడ్డి,కొమ్ము శ్రీకాంత్,మాదాసి రాంబాబు,ప్రభాకర్,గ్రామ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్,రమేష్, రవికుమార్,నాగరాజు,తిరుపతి, వెంకటేశ్వర్లు,సంతోష్,రాజు,పాష, కొత్త గట్టు రాజు,తదితరులు పాల్గొన్నారు…
previous post
next post