జై భారత్ వాయిస్ దామెర
హనుమ కొండ జిల్లా దామెర మండలం ఒగ్లా పూర్ గ్రామంలోని సైలానీ బాబా దర్గాను బుధవారం పరకాల, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చాదర్ కప్పి పీఠాధి పతులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలుచేశారు. నూతనంగా ఎమ్మెల్యేలుగా గెలుపొందిన తర్వాత మొదటిసారి దర్గాకు వచ్చిన ఎమ్మెల్యేలకు పీఠాధిపతులు వారికి ఘన స్వాగతం పలికి పుష్పగుచ్ఛం అందించి శాలువాలతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ సైలానీ బాబా దర్గాకు 50 ఏళ్ల చరిత్ర ఉందని, కుల, మతాలకు అతీతంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు రావడం అభినందనీయమన్నారు. ప్రతి సంవత్సరం గంధం జాతర ఘనంగా నిర్వహించడం ఈ దర్గా ప్రాముఖ్యత అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, ప్రజల, విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పన, వారి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయక త్వంలో సైలానీ బాబా దర్గా అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు. కార్యక్రమం లో దర్గా పీఠాధిపతి మహమ్మద్ అబ్దుల్ అమీద్ బాబా, టీపీసీసీ ఉపాధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్య, మొయినుద్దీన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మన్నెం ప్రకాశ్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, పలు శాఖల అధికారులు, నాయకు లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
previous post
next post