Jaibharathvoice.com | Telugu News App In Telangana
హైదరాబాద్ జిల్లా

ముఖ్యమంత్రిని కలిసిన ఐజేయూ, టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందం

జై భారత్ వాయిస్ భాగ్యనగర్
తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏ.రేవంత్ రెడ్డిని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) అధ్యక్షులు కే. శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీల నేతృత్వంలో ప్రతినిధి బృందం బుధవారం సాయంత్రం సచివాలయంలో కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా జర్నలిస్టుల ప్రధాన సమస్యలపై దృష్టి సారించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఐజేయూ, టీయుడబ్ల్యుజె నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు. సీఎంను కలిసిన ప్రతినిధి బృందంలో ఐజేయూ జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు కే. సత్యనారాయణ, టీయూడబ్ల్యూజే ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్,  ఉపాధ్యక్షులు కే.రాంనారాయణ, యూనియన్ నాయకులు కె.రాములు, శిగా శంకర్ గౌడ్ లు ఉన్నారు.

Related posts

అభినవ నేతాజీకి  రాష్ట్ర స్థాయి యోగా పోటీలో బ్రాంజ్ మెడల్

GTA VC Download link by jaibharath voice

రాచకొండపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి

Jaibharath News