Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

గృహలక్ష్మి ఇండ్లను పరిశీలించిన ఎంపిడిఒ

గృహలక్ష్మి ఇండ్లను పరిశీలించిన
ఎంపిడిఒ
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు) :
ఇటీవల బి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకంలో లబ్ధిదారుల కొత్తగా నిర్మించుకున్న ఇండ్లను హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశాల మేరకు గురువారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి ఇండ్లను పరిశీలించారు. ఈ మేరకు మండలంలోని కొత్తగట్టు, తిరుమలగిరి కామారం, చౌళ్లపల్లి, గ్రామాల్లోని 13 గృహలక్ష్మి ఇండ్లను, మండల ప్రత్యేక అధికారి జి రామ్ రెడ్డి, ఆత్మకూరు ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇండ్లను పరిశీలించి లబ్ధిదారుల వద్ద ఉన్న స్థలానికి సంబంధించిన పత్రాలు గృహానికి సంబంధించిన ఫోటోలను సేకరించారు సేకరించిన సమాచారాన్ని గృహ నిర్మాణ శాఖకు జిల్లా కలెక్టర్ కి సమర్పించడం జరుగుతుందని ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Related posts

కామారం లో హోమ్ పోలింగ్ ను పరిశీలించిన ఏసిపి

ఆత్మకూరు శివాలయంలో కార్తీక పౌర్ణమి ఉత్సవాలు

agrampahad sammakka mini jathara అగ్రంపహాడ్ సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం- వన దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు