జై భారత్ వాయిస్ వరంగల్
కేంద్ర ప్రభుత్వ పథకాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర గీసుకొండ మండలం గంగదేవిపల్లిలో నేడు అట్టహాసంగా ప్రారంభమైంది. కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాత జాయింట్ సెక్రటరీ హీన ఉస్మాన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రారంభాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రసంగించారు. యాత్ర ఉద్దేశం, ప్రయోజనాలు వంటివి సవివరంగా తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు వర్చువల్‌గా తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ ప్రసంగానికి ముందు గంగదేవిపల్లిలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఆయా మంత్రిత్వ శాఖలకు చెందిన వరంగల్ జిల్లా అధికారులు అవగాహన కల్పించారు. దీంతోపాటుగా వివిధ పథకాల లబ్దిదారులు ప్రసంగించారు. కార్యక్రమం సందర్భంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రతిజ్ఞకు చేశారు. ఈ సందర్భంగా లీడ్ బ్యాంక్ మేనేజర్ హవేళి రాజు మాట్లాడుతూ, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో పథకాలు చేరవేస్తున్నామని వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమ డే నోడల్ ఆఫీసర్ & యూబీఐ గీసుగొండ బ్రాంచ్ మేనేజర్ వి.విజయ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, బ్యాంకు వరకు విచ్చేసి తెలుసుకునే అనేక కార్యక్రమాలను ప్రజల వద్దకు చేరవేస్తున్నామని వివరించారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ద్వారా రూపొందించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అధికారిక పాంప్లెట్స్, బుక్‌లెట్స్, క్యాలండర్‌లను ఆవిష్కరించారు.
యువతకు ఉపయోగపడే పథకాలు, అవకాశాలకు సంబంధించిన ఏకీకృత పోర్టల్ మైభారత్ వెబ్ సైట్ గురించిన అవగాహన పాంప్లెంట్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు యువత తమ వివరాలు నమోదు చేసుకున్నారు. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ వరంగల్ క్షేత్ర ప్రచార అధికారి శ్రీధర్ సూరునేని, నెహ్రూ యువ కేంద్రం జిల్లా అధికారి అన్వేష్ చింతల, సర్పంచ్ గోనె మల్లయ్య, యూనియన్ బ్యాంక్ డిప్యూటీ రీజినల్ హెడ్ ఎన్.శ్రీనివాస్, డీఎంహెచ్ఓ వెంకటరమణ, డీడబ్ల్యూఓ శారద, నాబర్డ్ డీడీఎం చైతన్యరవి, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో తమకు ఈ యాత్ర ద్వారా పథకాల గురించి తెలియజేస్తుండటం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గంగాదేవిపల్లి సర్పంచి గోనె మల్లారెడ్డి మండల స్థాయి అధికారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు