Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

అగ్రంపహాడ్ జాతరకు ముందే అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

సమ్మక్క జాతరకు ముందే అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేయాలి
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):

మేడారం తర్వాత ద్వితీయ స్థాయిలో జరిగే అగ్రం పహాడ్ సమ్మక్క సారలమ్మ జాతరలకు ముందే అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేయాలని ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. అగ్రంపహాడు సమ్మక్క జాతరకు కోట్లాదిమంది భక్తులు తరలివచ్చి ఒకరోజు విడిది చేసి మొక్కులు చెల్లించి తిరుగు ప్రయాణం కడతారు. అలాంటి జాతరకు అభివృద్ధి పనులు హడావుడిగా చేపట్టి పూర్తి చేయడం వల్ల భక్తులు అనేక పాట్లు పడుతున్నారు. కోట్లాదిమంది తరలివచ్చే ఈ భక్తులకు సరియైన మరుగుదొడ్లు, స్నానపు గదులు అవసరం ఉన్నంత మేరకు చేయకపోవడం వల్ల భక్తులు అనేక ఇబ్బందులు పడుతుంటారు. దాదాపు 20 కిలోమీటర్ల వైశాల్యం మేరకు భక్తులు విడిది చేసి మొక్కులకు తరలివస్తారు. సమ్మక్క సారలమ్మ దేవతలకు గద్దె కు తరలి రావడంతో భక్తజన సందోహం వుప్పొంగు తుంది. కోళ్లు, గొర్రెలను దేవతలకు అర్పించిన తర్వాత ఏర్పడే వ్యర్త పదార్థాలను తీసివేయడంలో నిర్లక్ష్యం చేయడం వల్ల పారిశుధ్యం లోపించి భక్తులు ప్రతి జాతరకు అనేక అవస్థ పడుతుంటారు. మేడారం వెళ్లిన భక్తులు సైతం అగ్రంపహాడ్ జాతరకు తరలి వస్తారు.సమ్మక్క జాతరకు ప్రారంభానికి ముందే నిర్వహణ కమిటీ వేసి అభివృద్ధి పనులు నాణ్యతతో పూర్తి చేయాలని పూర్తిచేయాలని పలు గ్రామాల నుంచి ప్రజా ప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి , తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు విజ్ఞప్తి చేశారు. కోరిన కోర్కెలు తీర్చే సమ్మక్క సారలమ్మ తల్లుల జాతరకు నలుమూలల నుంచి వచ్చే ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు జరగకుండా నివారించేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Related posts

శివాలయంలో  ఎమ్మెల్యే ధర్మారెడ్డి ప్రత్యేక పూజలు

ఎస్సై కొడుకు రికార్డు వండర్ కిడ్ ను అభినందించిన పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝ

ఎల్కతుర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు