జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, 1999-2000 బ్యాచ్ కు చెందిన ఎస్.కె వాజీద్ అనే పూర్వ విద్యార్థి గత సంవత్సరం దురదృష్టవశాత్తు కరోనాతో మరణించాడు, వాజీద్ ఇద్దరు ఆడపిల్లలకు, మృతుని 10వ తరగతి స్నేహితులు 50,000 రూపాయలను కుటుంబ సభ్యులకు అందజేసి, స్నేహం విలువను చాటిచెప్పారు. ఈకార్యక్రమంలో శివప్రసాద్, తాటికొండ నరేందర్, నర్సింహస్వామి, ఆసం లింగమూర్తి, భవానీ, శ్రీలత పాల్గొన్నారు.