Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఏకశిల ప్రైమ్ పాఠశాలలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు:

జై భారత్ వాయిస్ దామెర
దామెర మండలంలోని ఏకశిలప్రైమ్ పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి విద్యార్థులకు ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏకశిల విద్యాసంస్థల డైరెక్టర్ బేతి కొండల్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు ప్రారంభించారు, భారతదేశం సర్వమత సాంప్రదాయాలకు పుట్టినిల్లు అని, బాల్య దశ నుంచే విద్యార్థులు ఎలాంటి తారతమ్యాలు లేకుండా అందరిని గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు పండుగ యొక్క విశిష్టతను విద్యార్థులకు వివరించారు వివిధ రకాల ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలలో అలరించిన విద్యార్థులను అభినందించి, విద్యార్థులకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు, ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ మణికుమార్ స్టాప్ ఇంచార్జ్ నవీన్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

ప్రతి ఒక్కరూ బలవర్ధకమైన పోషకాహారం తీసుకోవాలి

Jaibharath News

సారలమ్మ ఆగమనం పులకించిన భక్తులు

Jaibharath News

దామెర మండలంలో రక్షాబంధన్  వేడుకలు