జై భారత్ వాయిస్ దామెర
దామెర పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై కొంక అశోక్ ల్యాదేళ్ళ నుంచి దమ్మన్న పేట కు పెట్రోలింగ్ చేస్తుండగా రహదారి పక్కనే పత్తి ఏరుతున్న రైతులను చూసి వాహనాన్ని నిలిపి, వారి వద్దకు వెళ్ళారు. స్వతహాగా రైతు కుటుంబం నుంచి వచ్చిన ఎస్సై కూలీలతో ముచ్చటించారు. కూలీ ఎంత ఇస్తున్నారు, ఎప్పటి వరకు పనిచేస్తారు అనే విషయాలను మాట్లాడారు. అనంతరం మహిళా కూలీలు తింటున్న సద్దుల లోని భోజనాన్ని ఎస్సైకి పెట్టారు.దీంతో ఎస్సై ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. తాను చదువుకునే సమయంలో పోలంపనులకి వెళ్లి ఇలా తినేవాడినని, వాటిని గుర్తు చేశారని అన్నారు. ఎటువంటి సమస్యలు ఉన్నా తాను పోలీస్ స్టేషన్ లో అందుబాటులో ఉంటానని ఆయన వారికి హామీ ఇచ్చారు.
previous post