జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండలంలోని జాతీయ ఆదర్శ గ్రామమైన గంగదేవిపల్లిలో విశ్వా ఫౌండేషన్ ధర్మ సైనికులచే పర్యావరణ పరిరక్షణకు సామూహిక అగ్నిహోత్రం , గణపతి హోమం గ్రామ పంచాయితీ ఆవరణలో గ్రామ సర్పంచ్ గోనె మల్లారెడ్డి , సింగిరెడ్డి కుమారస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈకార్యక్రమంలో ధర్మసైనికులు శంకర్,సుధాకర్,సత్యనారాయన, కుమారస్వామి, శ్యామ్ సుందర్,వినయ్ కుమార్ మాట్లాడుతూ అగ్నిహోత్ర ఆధునిక సమస్యలకు పరిష్కారమని అన్నారు. ప్రకృతి ప్రసాదించిన వాటిని నాశనం చేయడం వల్ల మంచి ఆహారము త్రాగునీరు కలుషితమైందని సకల ప్రాణులు పీల్చడానికి మంచి గాలి కూడా దొరక్కుండా పోతుందని. ఊపిరాడక ఎన్నో నగరాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయని తెలిపారు
మన దేశంలోని కొన్ని నగరాలలో పటాణల్లో గాలి కాలుష్యం వల్ల ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి ఇంత జరుగుతున్న మార్పు రావడం లేదు కాలుష్యం స్థాయిలు తగ్గడం లేదని ముందు ముందు స్వచ్ఛమైన గాలి కొనుక్కోకుండా ఉండాలంటే ఈ ఈ వాయు కాలుష్యాన్ని నియంత్రించాలని అన్నారు మన పూర్వీకులు ప్రతి ఇండ్లలో అగ్నిహోత్రం ఆచరించడం వల్ల ఎలాంటి జబ్బులు లేకుండా సుఖమయ జీవనం గడిపారని ఈ సందర్భంగా గుర్తు చేశారు అగ్నిహోత్రం సర్వదాత అగ్నిహోత్ర మన ఇంటి పరిసరాల్లో విషపూరిత మైన వాయువులను శుద్ధిచేసి ఒక పవిత్రమైన వాతావరణం అందిస్తుందని రోగ నివారణ శక్తి పెంచుతుంది పిల్లలలోపల మంచి ఏకాగ్రత లభిస్తుంది తెలిపారు. బీపీ షుగర్ నియంత్రణ ఒక ఆదర్శమైన కుటుంబాన్ని తయారు చేస్తుందని చెప్పారు. వేదాలలో పరమేశ్వరుడు ఆదేశంగా చెప్పబడినది ఇది యుగధర్మం మూలధర్మం అని అన్నారు. ఈ కార్యక్రమంలో గంగదేవిపల్లి గ్రామ సర్పంచ్, వరంగల్ రెడ్ క్రాస్ డైరెక్టర్ గోనె మల్లారెడ్డి మాట్లాడుతూ మన గ్రామంలో కూడా అగ్నిహోత్ర కార్యక్రమాన్ని ఆచరించి ప్రతి కుటుంబం కూడా సుఖశాంతులతో ఉండాలని ఆయురారోగ్యాలతో ఉండాలని సూచించారు.
అగ్నిహోత్రం చేయడం వల్ల గతంలో రెండున్నర సంవత్సరాల క్రితం వచ్చినటువంటి కరోనా బారిన కూడా అగ్నిహోత్రము చేసిన వారి కుటుంబాలలో కరోణ చాలా దరిదాపు కూడా రాకుండా వెళ్ళిపోయింది అదేవిధంగా కొన్ని కొన్ని జబ్బులను కూడా చాలా దూరం చేసుకోవడం జరిగింది వివరించారు. గ్రామ ప్రజలు కూడా కచ్చితంగా ఈ యొక్క అగ్నిహోత్ర కార్యక్రమాన్ని ఆచరించి ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని గ్రామ ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలతోపాటు గీసుకొండ, మచ్చాపూర్, కొమ్మాల, గ్రామాల నుంచి అగ్నిహోత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు.