Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

కృత్రిమ కాళ్ళను ఏర్పాటు కొసం లబ్దిదారుల ఎంపిక

జైభారత్ వాయిస్ హన్మకొండ
రోటరీ క్లబ్ ఆఫ్ హన్మకొండ , రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం సంయుక్త ఆధ్వర్యంలో చేతన ఫౌండేషన్ , వేగం ఫౌండేషన్ సహకారంతో కృత్రిమ కాళ్ల పంపిణీ కోసం స్క్రినింగ్ కార్యక్రమాన్ని నిర్వహించామని రోటరీ క్లబ్ ఆఫ్ హనుమకొండ అధ్యక్షులు అన్నం రవీంద్రనాథ్ తెలిపారు..
ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నే కాకుండా కరీంనగర్ జగిత్యాల నల్గొండ సిద్దిపేట జిల్లాల నుండి 150 మంది లబ్ధిదారులు విచ్చేశారు ,వీరందరికీ కొలతలు తీసుకొని మరల ఫిబ్రవరి 4వ తారీఖు 2024 వ సంవత్సరంలో వీరికి కృత్రిమ కాళ్ళను అందజేయడం జరుగుతుందని తెలియచేశారు.ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ హనుమకొండ అధ్యక్షులు అన్నం రవీంద్రనాథ్ తోపాలు, కార్యదర్శి శిరీష్ కుమార్, కోశాధికారి & ప్రాజెక్టు చైర్మన్ గంగోజుల నరేష్, ఇంద్రసేనారెడ్డి , దారం శ్రీనివాస్ ,శరత్ బాబు ,మనోహర్ రెడ్డి రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం బాధ్యులు రంగారావు సాంబశివరావు చేతన ఫౌండేషన్ బాధ్యులు ఏకం ఫౌండేషన్ బాధ్యులు రోటరీ క్లబ్ ఆఫ్ అనుమకొండ బాధ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Related posts

డివైడర్ పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.

Jaibharath News

దివ్యాంగ విద్యార్థులకు ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తులు అహ్వనం

నూతన తహసీల్దారును మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు

Sambasivarao