అక్కంపేట రెవెన్యూ గ్రామ ఏర్పాటు పనులను వేగవంతం చేయండి
—-జిల్లా జాయింట్ కలెక్టర్ మహెందర్ జీ దళిత సంఘాల వినతి
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు)
ఆత్మకూరు మండలం అక్కంపేట రెవెన్యూ గ్రామ ఏర్పాటు పనులను వేగవంతం చేసి,అభివృద్ధిని అందించాలని దళిత సంఘాల నేతలు కోరారు.
బుధవారం రోజున హనుమకొండ జాయింట్ కలెక్టర్ మహెందర్ జీ దళిత సంఘాల అధ్వర్యంలో వినతిపత్రం ఇస్తూ డిమాండ్ చేశారు.
అక్కంపేట గ్రామము గతంలో పెద్దాపురం రెవెన్యూ గ్రామంలో ఉన్నపుడు అభివృద్ధి లేక కుంటుపడిందన్నారు.
అక్కంపేట గ్రామము
తెలంగాణ సిద్దాంత కర్త అచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్వగ్రామం కావడం గర్వకారణమన్నారు.
తెలంగాణ రాష్ట్ర మూడవ అసెంబ్లీ ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి , పరకాల ఎమ్మేల్యే ప్రకాశ్ రెడ్డి చోరవతో అక్కంపేట గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా ప్రకటించడం హర్షించదగిన విషయమన్నారు. వేంటనే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని జాతీయ మాల మహానాడు జాతీయ ఉపాద్యాక్షులు మన్నే బాబురావ్,దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి చుంచు రాజేందర్, రాష్ట్ర ఉపాద్యాక్షులు సిలువేరు బిక్షపతి,ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి సింగారం రవి ప్రసాద్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు అంకేశ్వరపు రాంచందర్ రావ్,డిబిఎఫ్ రాష్ట్ర నాయకులు కొమ్ముల కరుణాకర్,జిల్లా కార్యదర్శి చుంచు నరేష్, ఆర్టీసి కుమార్,రవిందర్,రవి తదితరులు పాల్గొన్నారు.
previous post