Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి*

జై భారత్ వాయిస్ దామెర,
సమాజంలోని పేద రెడ్ల సంక్షేమం, అభివృద్ధి కోసం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఆదివారం హనుమకొండ జిల్లా దామెర మండలం దుర్గంపేట శివారులోని ఎన్ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ వద్ద రెడ్డి సంఘం దామెర, ఆత్మకూరు మండలాల ముఖ్య నాయకులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా హనుమకొండ జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షుడు అర్జుల కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సామాజికంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా వెనుకబడిన నిరుపేద రెడ్లను ఆదుకునేందుకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. అయినప్పటికీ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ. 5వేల కోట్లు నిధులు కేటాయించాలని కోరారు. ఈ సమావేశంలో రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు అర్జుల కిషన్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కామిడి సతీష్ రెడ్డి, కోఆర్డినేటర్ మాడుగుల పాపిరెడ్డి, జిల్లా నాయకులు మన్నెం ఇంద్రారెడ్డి, దామెర మండల అధ్యక్షుడు కేతిపెల్లి శ్రీధర్ రెడ్డి, ఆత్మకూరు మండల అధ్యక్షుడు రేవూరి సంపత్ రెడ్డి, ముఖ్య నాయకులు రేవూరి సుధాకర్ రెడ్డి, ఆవాల రవీందర్ రెడ్డి, కూనాటి సునీల్ రెడ్డి, ఆరే వెంకట్ రెడ్డి, ఓరుగంటి కరుణాకర్ రెడ్డి, జిన్నా రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు..

Related posts

ఎమ్మేల్యే సమక్షం లో బి అర్ ఎస్ లో చేరిక

Jaibharath News

లిటిల్ ఫ్లవర్ స్కూలుపై చర్యలు తీసుకోవాలి

Sambasivarao

సమష్టి కృషితో మండలాభివృద్ధి సాధ్యం

Jaibharath News