జై భారత్ వాయిస్ వరంగల్
వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య ని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య కేక్ కట్ చేసి, టీఎన్జీవోస్ యూనియన్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు,. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్యమాట్లాడుతూ ఉద్యోగులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఉద్యోగులందరూ నూతన ఉత్సాహంతో పని చేస్తూ జిల్లాను రాష్ట్రంలో అగ్రభాగంలో ఉంచాలని తెలిపారు.టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్ మాట్లాడుతూ జిల్లాలోని ఉద్యోగులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఉద్యోగులందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ముందంజలో ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గాజె వేణుగోపాల్, కోశాధికారి పాలకుర్తి సదానందం, ఆర్డీఓ వాసు చంద్ర, ఏవో శ్రీకాంత్, సహాధ్యక్షులు హేమా నాయక్ సహాయ కార్యదర్శులు దుర్గారావు, చందర్, మధు, ఇంద్రసేనారెడ్డి, రమాదేవి, సిటీ యూనిట్ అధ్యక్షులు రాజు, కార్యదర్శి మధు చంద్ర, ఎంజీఎం యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు రవికుమార్, రవీందర్, సంగెం యూనిటీ అధ్యక్ష కార్యదర్శులు కిరణ్, సతీష్ నర్సంపేట యూనిట్ అధ్యక్షులు సత్యనారాయణ, మెడికల్ ఫోరం కార్యదర్శి రజనీకాంత్, వెటర్నరీ ఫోరం కార్యదర్శి రమేష్, మార్కెట్ ఫోరం అధ్యక్ష కార్యదర్శులు శివశంకర్, మురళి యాదవ్, గంగాధర్, యాదగిరి, జిల్లా సంఘ నాయకులు శంకేశి రాజేష్, సందీప్, నాగేశ్వరరావు, యాదగిరి, పూర్ణచందర్, రాజేశ్వరి, కుమారస్వామి, భగవత్, చిరంజీవి, గణేష్, సుదర్శన్, భాస్కర్, భరత్ తదితరులు పాల్గొన్నారు.
next post