జై భారత్ వాయిస్ దామెర
దామెర పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మొరం, మట్టి తరలిస్తే చర్యలు తప్పవని దామెర ఎస్సై కొంక అశోక్ హెచ్చరించారు.మంగళవారం సాయంత్రం ఒగ్లాపూర్ లోని సైలానిబాబా దర్గా వద్ద వాహన తనిఖీలు దామెర ఎస్సై శ్రీ కొంక అశోక్ పెట్రోలింగ్ చేస్తుండగా అక్రమంగా మొరం తరలిస్తున్న రెండు టిప్పర్ లను పట్టుకొని, వివరాలు తెలుసుకోగా పసరగొండ శివారు లోని ఓ క్రషర్ నుంచి హనుమకొండ కి తీసుకొని వెళ్తున్నట్టు తెలిపారు.దీంతో వాటిని సీజ్ చేసి, యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
previous post