జై భారత్ వాయిస్ గీసుకొండ
జాతీయ ఆహార భద్రత పథకం క్రింద సరఫరా వ్యవసాయక్షేత్ర సందర్శన లో బాగంగా గీసుగొండ మండలం కొమ్మాల గ్రామంలో నల్లారి మహేందర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో సాగు చేసిన వేరుశనగ మినికిట్ ప్రదర్శన క్షేత్రాన్ని గురువారం నాడు మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా వ్యవసాయ అధికారి ఉష ఆధ్వర్యంలో సందర్శించారు ఈ క్షేత్ర సందర్శనకు వర్ంగల్ జిల్లా వ్యవసాయ అధికారి, ఉష, , తోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లా ,
NFSMకన్సల్టెంట్ , సారంగం, గీసుగొండ మండల మండల వ్యవసాయ అధికారి, హరి ప్రసాద్ మండల వ్యవసాయ విస్తరణ అధికారులు,రైతులు వీరాటి రవీందర్ రెడ్డి తదితరులు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి ఉష మాట్లాడుతూ వేరు శనగ పంటలో ప్రస్తుతం ఎకరాకు 200 కిలోల జిప్సంను వేసుకుంటే కాయల సైజు బాగా ఉండి నాణ్యమైన గింజలు వస్తాయని తెలిపారు వేరుశనగలో ఆకు ముడత పురుగు నివారణకు క్లోరిపైరిఫాస్ 500 మిల్లి.లిటర్లు . లేదా ఎసిఫేట్ ౩౦౦ గ్రా. 200 లీటర్ల నీటికి చొప్పున కలుపుకొని ఎకెరకు చొప్పున పిచికారి చేసుకోవాలని సూచించారు పొగాకు లద్దె పురుగు నివారణకు ఫ్లూబెండమైడ్ 40 మి.లి. ఎకరాకు 200 లీటర్ల నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి లేదా విషపు ఎరను తయారు చేసుకొని ( వరి తవుడు 5 కిలోలు + బెల్లం అర కిలో + మోనో క్రోటోఫాస్ 500 మి.లీ . )చొప్పున ఎకరాకు కలుపుకొని సాయంత్రం వేళలో పొలంలో చల్లుకోవాలని తెలిపారు.
మొక్కజొన్న పంటలలో ప్రస్తుతం ఆశిస్తున్న కత్తెర పురుగు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు.
