ఆత్మకూరు మండల కేంద్రానికి జాతీయ గుర్తింపు తీసుకువస్తాం
– పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
(జై భారత్ వాయిస్
ఆత్మకూరు):
ఆత్మకూరు మండలం ను ఆదర్శంగా అభివృద్ధి చేసి జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీగా గుర్తింపు తీసుకు వస్తామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆత్మకూరు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో రాష్ట్ర ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత సర్పంచ్ పర్వతగిరి రాజుతో పాటు అధికారులతో కలిసి సమావేశమయ్యారు. గ్రామ అభివృద్ధి గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దాతల సహకారంతో కూరగాయల మార్కెట్ ను ఏర్పాటు చేసిన సర్పంచ్ రాజును ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అభినందించారు. ఆత్మకూరు ఆదర్శంగా అభివృద్ధికి కారణం నీ అంకిత భావంతోటే సాధ్యమైందని కొనియాడారు. ఆత్మకూరు ను మరింత అభివృద్ధి చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాలని సర్పంచ్ పర్వతగిరి రాజుకు ఎమ్మెల్యే సూచించారు . మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి ఎన్ని అడ్డంకులు సృష్టించిన కూడా రాష్ట్ర ఉత్తమ సర్పంచి అవార్డు అందుకోవడం అభినందనీయమన్నారు. గ్రామంలోని అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ గృహాలను అందిస్తానని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో గ్రామ పంచాయితీ కార్యదర్శి మేడ యాదగిరి, మండల యూత్ కార్యదర్శి తనుగుల సందీప్, సర్పంచ్ కంచ రవికుమార్, కాంగ్రెస్ జిల్లా నాయకులు గుండెబోయిన శ్యామ్, మత్స్యశాఖ సొసైటీ చైర్మన్ భయ్యా తిరుపతి, కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు బయ్య కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు
–
previous post