Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ప్రభుత్వమే అంబేడ్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించాలి

జై భారత్ వాయిస్ దామెర
ప్రపంచంలోనే మానవత్వ విలువలు కలిగిన భారత రాజ్యాంగాన్ని రూపొందించిన నేటి యుగ పురుషుడు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు ప్రభుత్వమే తగిన రక్షణ చర్యలు చేపట్టాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పరిరక్షణ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం విగ్రహ పరిరక్షణ కమిటీ అధ్వర్యంలో దామెర మండల కేంద్రంలోను, హాసన్ పర్తి మండలం వంగపాడ్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహాలను శుద్ది చేసి పూల మాలలంకరణ కార్యక్రమం చేపట్టారు.అంబేడ్కర్ విగ్రహ పరిరక్షణ కమిటీ జిల్లా, మండల నాయకులు రిటైర్డ్ డిఎస్పీ దామెర నర్సయ్య, రిటైర్డ్ హెడ్మాస్టర్ నక్క సుదర్శన్, అడ్వకేట్ దండు మోహన్, కన్వీనర్ బండి అశోక్, సూరాసి విక్రమ్, తరాల రవీందర్, పోతుల కొమ్మాలు, దండు రాజు, సాదు ధనుంజయ, సుంతం శ్రీనివాస్, వర్కుటి ఎల్లయ్య, దామెర సర్పంచ్ శ్రీరామ్ రెడ్డి, లేదళ్ళ సర్పంచ్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మీసేవా కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

బాదిత కుటుంబాన్ని పరామర్శ

వరంగల్ జిల్లా బిజెపి పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ