(జైభారత్ వాయిస్ దామెర)
దామెర మండలం ఊరుగొండలో ఈ నెల 8 నుంచి 12 రోజుల పా టు నిర్వహించ తలపెట్టిన శ్రీరుక్మిణీ, సత్యబామ సహిత శ్రీలక్ష్మీ నర్సింహస్వామి అధ్యయన కళ్యాణోత్సవాలను నిర్వాహకులు వైభవంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో గురువారం గ్రామంలో ప్రధాన దేవాలయ ప్రాంగణంలో స్వామివారి కళ్యాణతంతు కోసం సర్వాంగ సుందరంగా కళ్యాణ మండపం తీర్చిదిద్దారు. ఆలయ ప్రధానార్చకులు తూపురాణి శ్రీనివాసాచార్యుల వేదమంత్రోశ్చరణల నడుమ కళ్యాణ బ్రహ్మోత్సవాల ప్రత్యేక పూజలను జరిపించారు. ఇందులో భాగంగా 11న గురువారం ఉదయం ప్రాబోధికం, హోమం, బలిహరణం వంటి విశిష్ట పూజాధికాలను నిర్వహించారు. అనంతరం సాయంత్రం స్వామి వారికి ఎదురుకోళ్లు, ఆచార,సంప్రదాయ రీతిలో అన్ని కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో స్వామి వారికి శ్రీలక్ష్మీనర్సింహ స్వామి భజన మండలి సభ్యుల చేతుల మీదుగా పుస్తెలు, మట్టెలు, పట్టు వస్త్రాలను సమర్పించారు. తరువాత శ్రీరుక్మిణీ, సత్యభామ సహిత శ్రీలక్ష్మీనర్సింహస్వామి కళ్యాణ మహోత్సవం క్రతువును నేత్ర పర్వంగా జరిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ గోగుల సత్యనారా యణ రెడ్డి దంపతులు, కూనాటి రామకృష్ణారెడ్డి దంప తులు, జక్కుల రాణీరవీందర్ దంపతులు, మ ల్లాడీ రాజి రెడ్డి దంపతులు, కొడకండ్ల మల్లారెడ్డి దంప తులతో పాటు ఊరుగొండ, దుర్గంపేట, దమ్మ న్నపే ట సీతారాంపురం, ఓగ్లాపూర్, ల్యాడెల్ల తదితర గ్రా మాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వా మీ వారి కల్యాణాన్ని దర్శించుకున్నారు.
previous post