జై భారత్ వాయిస్ వరంగల్
గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ వసంతాపూర్ లో కార్పొరేటర్ గద్దె బాబు పర్యాటించారు..
ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వసంతాపూర్ లో మున్సిపల్ సిబ్బంది స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. .డ్రైనేజిల్లో చెత్త చెదారం లేకుండా ఎప్పటికీ అప్పుడు పరిశుభ్ర పరుస్తూ,గ్రామాన్ని శుభ్రంగా ఉంచాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు.గ్రామంలో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ,ప్రజలు రోడ్డుమీద ఇంటి పరిసర ప్రాంతంలో చెత్త చెదారం వేయకుండా మునిసిపల్ వాహనంలోనే చెత్త వేయాలని కొరారు. డివిజన్లో అభివృద్ధి పనులను కూడా త్వరలో ప్రారంభించడం జరుగుతుందని ప్రజల సమస్యలు తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ పార్టీ నాయకులు,మునిసిఫల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

previous post