అగ్రంపాడు సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధికి నిధులు మంజూరు
ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి చొరవతోఆరువై లక్షల మంజూరు.
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
మినీ మేడారం గా ప్రసిద్ధిగాంచిన ఆత్మకూరు మండలం ఆగ్రం పహాడ్ సమ్మక్క సారలమ్మ జాతర జాతర అభివృద్ధికి రు.59. 65 లక్షల నిధులను మంజూరు చేశారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రత్యేక చొరవతో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖను కలిసి జాతరలో నెలకొన్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొని వెళ్లగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి జీవో నెంబర్ 2 తో రు. 59.65 లక్షలు నిధులను విడుదల చేస్తూజీవో జారీ చేశారు.
దీంతో జాతరలో భక్తుల సౌకర్యం తాగునీరు సారిశుధ్యం అంతర్గట్ట రోడ్ల నిర్మాణం భక్తుల వసతుల కోసం మంజూరు చేసినట్లుతెలిపారు.. అగ్రంపహాడు జాతరకు నిధులు మంజూరు చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి, కి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
previous post
next post